దటీజ్ భారత్.. చైనా సైనికుడికి ఆక్సిజన్..  - MicTv.in - Telugu News
mictv telugu

దటీజ్ భారత్.. చైనా సైనికుడికి ఆక్సిజన్.. 

October 19, 2020

చైనా సైనికుడిని పట్టుకున్న భారత్ మన పూర్వ యుద్ధనీతిని తప్పలేదు. మన శతృవే అని అతన్ని మట్టుబెట్టలేదు. ఆ సైనికుడికి ఆక్సిజన్ అందించడమే కాకుండా అతిథిలా అతని మంచీచెడ్డా చూసుకుంటూ దటీజ్ భారత్ అని చైనాకు శాంతిసందేశం వినిపిస్తోంది. లడఖ్‌లో చైనా సైనికుడిని పట్టుకున్నట్లు ఆర్మీ సోమవారం వెల్లడించింది. వాస్తవధీనా రేఖ దాటి దేశంలోకి వచ్చిన సైనికుడు.. చుమర్‌-దేమ్‌చౌక్‌లో ప్రాంతంలో పట్టుబడ్డాడని తెలిపింది. 

కార్పోరల్‌ వాంగ్‌యా లాంగ్‌గా సైనికునిగా గుర్తించామని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రొటోకాల్‌ను అనుసరించి చైనా ఆర్మీ.. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎంఎ)కి సైన్యం అప్పగించనుందని ప్రకటనలో స్పష్టంచేసింది. సదరు సైనికునికి ఆహారం, దుస్తులతో పాటు ఆక్సిజన్‌తో సహా వైద్య సహాయాన్ని అందిస్తున్నామని వివరించింది. తప్పిపోయిన సైనికుడి ఆచూకీ గురించి చైనా ఆర్మీ నుంచి అభ్యర్థన వచ్చిందని పేర్కొంది. ఫార్మాలిటీస్‌ పూర్తయ్యాక అతడిని చుషుల్‌-మోల్డో సమావేశ స్థలంలో ఆ దేశ అధికారులకు అప్పగిస్తామని తెలిపింది. కాగా, పారిపోతున్న వాడిని చంపకు, శరణు అన్నవాడిని చంపకు, చేతిలో ఆయుధం లేని వాడి మీద దాడి చెయ్యవద్దు, శతృవును కూడా ప్రేమించాలి అన్న మన యుద్ధనీతిని భారత్ అనుసరించి చూపించింది.