పుల్వామా పాపం వెనక మన జవాన్.. పాక్  కిలేడితో.. - MicTv.in - Telugu News
mictv telugu

పుల్వామా పాపం వెనక మన జవాన్.. పాక్  కిలేడితో..

May 17, 2019

indian army jawan behind pulwama attack Madhya Pradesh ATS arrests army jawan 'honeytrapped' by ISI from Mhow.

పుల్వామా దాడి వెనుక పాకిస్తాన్  ఉగ్రమూకలు పెద్ద కుట్రే పన్నాయి. మన సూదితో మన కంట్లోనే పొడిచాయి. పాక్ అమ్మాయిని ఎరగా వేసి భారత జవాన్‌తో ఛాటింగ్ చేయించి సీఆర్పీఎఫ్ రహస్యాలను సేకరించాయి.

ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని  పుల్వామాలో జరిగిన దాడిలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తులో ‘హానీ ట్రాప్’ బయటపడింది.  పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కదలికల సమాచారం ఇచ్చింది భారత సైనికుడు అవినాష్ కుమారే(25) అని వెల్లడైంది.

దర్యాప్తు వివరాల ప్రకారం. .అవినాష్ కుమార్ ఓ పాక్ అమ్మాయితో వాట్సాప్ స్నూఫింగ్ ద్వారా చాటింగ్ చేశాడు. సెక్స్ చాట్  చేయడంతోపాటు డబ్బుకు కక్కుర్తి పడి భారత సైనిక రహస్యాలను పాక్ ఐఎస్ఐకు అందించాడు. అవినాష్ బ్యాంకు ఖాతాలో పాక్ నుంచి రూ.50వేలు డిపాజిట్ కూడా అయింది.  సీఆర్పీఎఫ్ బలగాల కదలికల సమాచారం అవినాష్ ఆమెకు అందజేయడంతో, ఉగ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేసి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చంపేశారు. అవినాష్ కుమార్‌ను అరెస్టు చేసి భోపాల్‌లోని స్పెషల్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా అతన్ని రిమాండుకు తరలించారు.

అవినాష్ తండ్రి కూడా ఆర్మీ జవానే. అతను గతేడాది ఇండోర్ సమీపంలోని మోహో పట్టణంలోని బీహార్ రెజిమెంట్‌లో  క్లర్కుగా పనిచేశాడు. 2018లో అతన్ని అసోంకు బదిలీ చేశారు. అవినాష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.