ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..15 మంది హతం - MicTv.in - Telugu News
mictv telugu

ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..15 మంది హతం

October 20, 2019

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌‌లో ఈరోజు భారత ఆర్మీ దాడులు చేపట్టింది. శతఘ్నులతో చేసిన ఈ దాడిలో దాదాపు 15 మంది ఉగ్రవాదులు, నలుగురు పాకిస్తాన్ జవాన్లు హతమైనట్లు సమాచారం. అలాగే, పాక్ ఆర్మీ పోస్టులు సైతం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 

బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేపట్టిన తర్వాత చేస్తున్న దాడులివి కావడం విశేషం. బాలాకోట్ దాడులతో పాక్ సైన్యం సాయంతో పీవోకేలో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు, ఈరోజు భారత సైనికులే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో పీవోకేలో భారత్ దాడులు చేసింది. ఈ దాడులు తాంగ్ధర్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉండే నీలం ఘాట్‌ ప్రాంతంలో జరిగాయి. పీఓకేలో ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టాయని భారత సైన్య ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఆపరేషన్‌ వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.