మేజర్ సుమన్ గవానీకి ఐక్యరాజ్యసమితి పురస్కారం - MicTv.in - Telugu News
mictv telugu

మేజర్ సుమన్ గవానీకి ఐక్యరాజ్యసమితి పురస్కారం

May 29, 2020

 

un military.

నేటి మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. పురుషులతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో అత్యుత్తమ పురస్కారాలను గెలుచుకుంటున్నారు. తాజాగా భారత సైన్యాధికారిణి మేజర్ సుమన్ గవానీ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారమైన ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్-2019’కి ఎంపికయ్యారు. 

దక్షిణ సుడాన్‌లో శాంతి పరిరక్షణలో ఉత్తమ సేవలందించినందుకుగాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. మే 29న అంతర్జాతీయ యూఎన్ పీస్ కీపర్స్ డే సందర్భంగా ఈ అవార్డును అందించనున్నారు. సుమన్ గవానీతో పాటు బ్రెజిల్‌కు చెందిన నేవీ ఆఫీసర్ కార్లా మాంటెరియో డి కాస్ట్రో అరుజోవా ఈ అవార్డు పంచుకోనున్నారు.