శుభవార్త..ఆర్మీలో అందరికీ చాన్స్, 3 ఏళ్లు మాత్రమే! - MicTv.in - Telugu News
mictv telugu

శుభవార్త..ఆర్మీలో అందరికీ చాన్స్, 3 ఏళ్లు మాత్రమే!

May 13, 2020

Army

భారత సైన్యంలో కొన్ని పెనుమార్పులకు కేంద్రప్రభుత్వం పూనుంకుంది. ఇప్పటికే త్రివిధ దళాల్లో పనిచేస్తున్న జవాన్ల ప‌ద‌వీవిర‌మ‌ణ వ‌య‌సును యాబ్భై సంవత్సరాలకు పెంచనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా దేశానికి సేవ చేసే అవకాశాన్ని దేశ పౌరులందరికీ కల్పించాడనికి కేంద్రం సన్నద్ధం అవుతోంది.

ప్రస్తుతానికి ఆర్మీలో చేరాలనుకునే వారు రాత పరీక్షలు, ఫీజికల్ టెస్టులు పాస్ అవ్వాల్సి ఉంది. కానీ ఇవేమి లేకుండానే ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ కింద 3 సంవత్సరాల పాటు వివిధ ర్యాంకుల్లో పనిచేసేందుకు సామాన్య ప్రజలకు అవకాశం కల్పించాలని ఆర్మీ యోచిస్తోంది. యువకుల్లో ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించడంతో పాటు దేశానికి సేవ చేయాలనే తపన యువతలో కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.