భారత్‌లోకి చొరబడుతున్న పాక్ కమాండోలు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లోకి చొరబడుతున్న పాక్ కమాండోలు (వీడియో)

September 9, 2019

భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో దాయాది దేశం తరుచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ తమ బలగాలను ఉసిగొల్పుతోంది. ఉగ్రదాడులు కూడా చేయించేందు చొరబాట్లకు తెరలేపుతోంది. తాజాగా దీనికి సంబంధించిన ఆధారాలను భారత సైన్యం విడుదల చేసింది. కెరాన్ సెక్టర్‌లో పాక్ సైన్యం నక్కి నక్కి మన భూ భాగంలోకి చొరబడిన తీరును కళ్లకు కట్టినట్టుగా చూపించే వీడియోను విడుదల చేశారు.

ఆగస్టు మొదటి వారంలో ఐదుగురు కమాండోలు భారత భూ భాగంలోకి తమ దేశ జెండాను పట్టుకొని దొంగచాటున ప్రవేశించడం ఈ వీడియోలో రికార్డు అయింది. ఎవరూ చూడకుండా భూమిపై నెమ్మదిగా పాకుతూ చొరబడేందుకు ప్రయత్నించారు.ఈ చొరబాట్లను ముందే గ్రహించిన ఆర్మీ వారి చర్యలను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ప్రతి క్షణం సరిహద్దుల్లో గస్తీ కాస్తూ పాక్ చర్యలను తిప్పికొడుతున్నారు. కాగా ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ వాదనను తప్పుబడుతూనే ఉన్నాయి. అయినా కూడా తరుచూ చొరబాట్లకు ప్రయత్నిస్తూ గత ఒప్పందాలకు తూట్లు పొడుస్తోంది.