సరిహద్దుల్లో రెచ్చిపోయిన పాక్ రేంజర్లు.. తిప్పికొట్టిన భారత్ - MicTv.in - Telugu News
mictv telugu

సరిహద్దుల్లో రెచ్చిపోయిన పాక్ రేంజర్లు.. తిప్పికొట్టిన భారత్

July 8, 2020

Punch Sector

దాయాది పాకిస్తాన్ తన విపరీత బుద్ధిని ఏ మాత్రం మార్చుకోవడం లేదు. సరిహద్దుల్లో తరుచూ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు తూట్లు పొడుస్తూనే ఉంది. తాజాగా పాక్ రేంజర్లు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కాల్పులకు తెగబడ్డారు. పూంచ్‌ జిల్లాలో ఈ కాల్పులు జరిగినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. భారత ఆర్మీ కూడా ప్రతి దాడులకు దిగడంతో తొకముడిచినట్టుగా తెలిపారు. 

బాలాకోట్, మెంధర్‌ సెక్టార్‌ల మీదుగా మోర్టార్ షెల్స్‌తో కాల్పుల దిగారు. దాదాపు గంటసేపు కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై వాటిని తిప్పికొట్టారు. కాల్పులు జరుపుతూ భారత సైన్యాన్ని ఏమార్చి ఉగ్రవాదులను లోపలికి చొప్పించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. అనునిత్యం కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా ఇప్పటికే జమ్మూ కశ్మీర్‌లోపల ఉన్న ఉగ్రవాదులతో నిత్యం సైన్యం పోరాడుతూనే ఉంది. మరోవైపు పాక్ రేంజర్లు శాంతి వ్యాఖ్యాలు వల్లిస్తూనే ఈ విధమైన చర్యలకు దిగడంపై భారత్ ఆగ్రహంగా ఉంది.