ఎంత బరువని కాదు, ఎంత పొడుగో చూడండి (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత బరువని కాదు, ఎంత పొడుగో చూడండి (వీడియో)

January 17, 2020

Cake.

‘ఎన్ని కిలోల కేకు తయారుచేశామన్నది కాదు సిద్దప్పా.. ఎంత పొడవు కేకు తయారు చేశామన్నది చూడు. అది ఎన్ని మీటర్లు ఉందో లెక్కించు..’ అన్నట్టే ఉంది ఈ కేకు తయారుచేసినవారి సంబరం చూస్తుంటే. 5.3 కిలోమీటర్లు పొడవు, 10 సెంటీమీటర్ల మందంతో 27,000 కిలోల బరువుతో దీన్ని తయారు చేశారు. ఇంత భారీ కేకు తయారుచేయడానికి ఎంతమంది షెఫ్‌లు, బేకర్లు కావాలో ఊహించండి. మీ ఊహ నిజమే. కేరళలోని త్రిసూర్‌కు చెందిన వందల మంది బేకర్లు, షెఫ్‌లు ఈ భారీ కేకును తయారుచేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.

దీని తయారీకి 12,000 కిలోల పంచదార, మైదాలను వాడారు. ఈ వెనీలా కేక్‌ను మరింత రుచికరంగా చేయటానికి దానిని చాకోలేట్‌ పూతతో అలంకరించారు. దీనిని చూడటానికి వేలాదిమంది తరలివచ్చారు. 5.3 కిలోమీటర్ల పొడవున్న ఈ కేక్‌ను గిన్నిస్‌ సంస్థకు చెందిన ప్రతినిధులు పరిశీలించి సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీని కొలతలను కచ్చితంగా నమోదు చేశాక ప్రపంచ రికార్డును ప్రదానం చేస్తారని బేక్‌ ప్రతినిధులు తెలిపారు.కాగా, ఈ కేకుకు సంబంధించిన వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తన అధికారిక ట్విటర్‌‌లో పంచుకుంది. దీనిని చూసిన నెటిజన్లు అబ్బురపడుతున్నారు.