బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల అలర్ట్. ఇండియన్ బ్యాంక్ లో స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 200కంటే ఎక్కువ పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం ఈ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఫైనాన్షియల్ అనలిస్ట్ (క్రెడిట్ ఆఫీసర్), రిస్క్ ఆఫీసర్, ఐటీ/కంప్యూటర్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ ఆఫీసర్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఫారెక్స్ ఆఫీసర్, హెచ్‌ఆర్ ఆఫీసర్ మొత్తం 203 పోస్టుల కోసం అప్లికేషన్ విండోను బ్యాంక్ ప్రారంభించింది. 16 ఫిబ్రవరి తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అభ్యర్థులు తమ దరఖాస్తును సూచించిన చివరి తేదీ 28 ఫిబ్రవరి 2023 వరకు సమర్పించవచ్చని బ్యాంకు తెలిపింది.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్, indianbank.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. నమోదు చేసిన వివరాలతో లాగిన్ చేసి అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తు రూ. 850 ఫీజు చెల్లించాలి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు రూ.175 మాత్రమే.
ఇండియన్ బ్యాంక్ SO రిక్రూట్‌మెంట్ 2023: పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య:
-ఫైనాన్షియల్ అనలిస్ట్ (క్రెడిట్ ఆఫీసర్) – 60 పోస్టులు
-రిస్క్ ఆఫీసర్ – 15 పోస్టులు
-ఐటీ/కంప్యూటర్ ఆఫీసర్ – 23 పోస్టులు
-సమాచార భద్రత – 7 పోస్టులు
-మార్కెటింగ్ ఆఫీసర్ – 13 పోస్టులు
-ట్రెజరీ ఆఫీసర్ – 20 పోస్టులు
-ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ – 50 పోస్టులు
-ఫారెక్స్ ఆఫీసర్ – 10 పోస్టులు
-హెచ్‌ఆర్ ఆఫీసర్ – 5 పోస్టులు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే చివరి తేది మరో రెండు రోజులతో ముగియనుంది. చివరి క్షణాల్లో ఆన్ లైన్లో నమోదు ప్రక్రియ ఇబ్బందికరంగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేసుకోండి.