ఇంగ్లాండ్ గడ్డపై సత్తాచాటాలని ఉరకలు వేసిన భారత జట్టుకు కాస్త బ్రేక్ పడింది. గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ వంద పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలి వన్డేలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగి ఆరు వికెట్లు పడగొట్టగా, రెండో వన్డేలో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన బంతితో మాయ చేశాడు. కానీ, భారత బ్యాటర్లు మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఈ విజయంతో సిరీస్‌ను ఇంగ్లాండు 1-1తో సమం చేసింది.
మొదటగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. అందులో మొయిన్ అలీ (47), విల్లీ (41) తమ జట్టుకు మెరుగైన స్కోరును అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 38.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. గ్రీజ్‌లో ఏ ఒక్క బ్యాట్‌మ్యాన్ కూడా నిలవలేకపోయాడు. రోహిత్ శర్మ (0); ధావన్ (9), కోహ్లి (16), పంత్ (0), సూర్యకుమార్ (27), హార్దిక్ (20), జడేజా (20), షమి (23), బుమ్రా నాటౌట్‌గా నిలువగా, చాహల్ (3) పరుగులు చేసి ఓౌటయ్యాడు. దీంతో సిరీస్ సమం అయ్యింది. ఇక, భారత్, ఇంగ్లాండు మధ్య చివరి వన్డే ఆదివారం మాంచెస్టర్‌లో జరుగనుంది.