భారతీయుల మెదళ్ళు చిన్నవి..శాస్త్రవేత్తల వెల్లడి - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయుల మెదళ్ళు చిన్నవి..శాస్త్రవేత్తల వెల్లడి

October 29, 2019

'Indian brain is smaller' IIIT-Hyderabad researchers create Indian Brain Atlas for the first time

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ పరిశోధకులు మొదటిసారి భారతీయ బ్రెయిన్ అట్లాస్‌ రూపొందిస్తున్నారు. ఇందుకోసం వారు జరిపిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా లాంటి పశ్చిమ దేశాలు, జపాన్ లాంటి తూర్పు దేశాల ప్రజలతో పోల్చితే… భారతీయుల మెదళ్లు పొడుగు, వెడల్పూ, బరువు తక్కువగా ఉన్నాయట. ఈ రీసెర్చ్‌ వివరాల్ని న్యూరోలజీ ఇండియా జర్నల్‌లో తెలిపారు. 

మాంట్రియల్ న్యూరోలాజికల్ ఇన్‌స్టిట్యూట్‌లో మెదడుకి సంబంధించిన టెంప్లేట్ ఉంది. అది ప్రపంచంలో చాలా మందికి ఉండే సగటు మెదడు నిర్మాణం. చైనా, కొరియా దేశాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇప్పటివరకు భారతీయుల మెదళ్లకు సంబంధించిన టెంప్లేట్ లేదు. తాజాగా 50 మంది పరిశోధకులు కలిసి భారతీయుల బ్రెయిన్ టెంప్లేట్‌ని తయారుచేశారు. పశ్చిమ ఆసియా దేశాల మెదళ్లతో పోల్చితే… భారతీయుల మెదళ్లు చైనా, కొరియా మెదళ్ళకు దగ్గరగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. వయసు పెరుగుతోన్న కొద్దీ మనుషుల మెదళ్లలో కూడా మార్పులు వస్తున్నాయి. ఆసియా దేశాల ప్రజల మెదళ్లు నానాటికీ చిన్నగా అవుతున్నాయి. ఈ మార్పు మనుషుల వయసు, జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు చేస్తామంటున్నారు. ఈ పరిశోధన వల్ల అల్జీమర్స్, ఇతర మతిమరపు వ్యాధుల్ని ముందుగానే కనిపెట్టడం వీలవుతుందని పరిశోధకులు తెలిపారు. మెదళ్లకు సంబంధించి మరింత లోతుగా తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం మరో 100 మంది ఆసక్తి ఉన్నవారిని చేర్చుకోబోతున్నారు.