ప్రజలను దోచుకోవడానికే రాజ్యాంగం రాశారు.. మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజలను దోచుకోవడానికే రాజ్యాంగం రాశారు.. మంత్రి

July 6, 2022

అంబేద్కర్ సారథ్యంలో రూపొందిన భారత రాజ్యాంగంపై కేరళ మత్స్య శాఖ మంత్రి సాజి చెరియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధారణ ప్రజలను వీలైనంత ఎక్కువగా దోచుకోవడానికే రాజ్యాంగం రాశారని అభిప్రాయపడ్డారు. పాతాన మిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రిపై తీవ్ర దుమారం చెలరేగింది. విపక్షాలు ఆయనపై మండిపడ్డాయి. దీంతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆగ్రహించి.. మంత్రి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంత్రి చెరియన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవముందని, పాలనా వ్యవస్థ సరిగ్గా లేనందున ఆ కోణంలో మాట్లాడానని వివరణ ఇచ్చారు. దాంతో పాటు తన మాటలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వారికి క్షమాపణలు కోరుతున్నానన్నారు. అయినా విపక్షాలు ఆగక, మంత్రిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లేదంటే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించాయి.