Indian couple from Vietnam caught in Delhi with 45 guns worth rs.22 lakh
mictv telugu

భార్యభర్తల గన్స్ స్మగ్లింగ్.. బ్యాగులు చూసి అధికారులు షాక్

July 13, 2022

భార్యాభర్తలూ ఇద్దరూ కలసి ఉద్యోగం చేస్తేనో, వ్యాపారం చేస్తేనో పది మందిలో గొప్ప కానీ.. కలసి స్మగ్లింగ్ చేస్తే మాత్రం కచ్చితంగా వార్తే. ఆ దంపతులు విదేశాల నుంచి భారత్కు భారీ సంఖ్యలో తుపాకులు స్మగ్లింగ్ చేస్తున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకోవడంతో అసలు విషయం తెలిసింది. వారి నుంచి రూ.22లక్షలు విలువైన 45 గన్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పట్టుబడిన జంట.. వియత్నాం నుంచి దిల్లీకి వచ్చింది. అధికారులు అనుమానంతో వారి దగ్గర ఉన్న రెండు ట్రాలీ బ్యాగ్లను తెరిచి చూశారు. ఇన్ని తుపాకుల్ని ఒక్కసారిగా చూసి షాక్ అయ్యారు.

గతంలో ఇదే తరహాలో రూ.12 లక్షలు విలువైన 25 తుపాకుల్ని భారత్‌కు తీసుకొచ్చినట్లు ఆ జంట అంగీకరించిందని కస్టమ్స్ కమిషనర్ వెల్లడించారు. ఆ తుపాకులు నిజమైనవో కావో బాలిస్టిక్స్ నివేదిక వచ్చాక తెలుస్తుందని తెలిపారు. అయితే.. ఆ గన్స్ అన్నీ పనిచేస్తాయని ఎయిర్‌పోర్ట్‌లోని ఎన్‌సీజీ బృందం ప్రాథమికంగా నిర్ధారించిందని చెప్పారు.