ఐసీయూలో రిషబ్ పంత్.. గాయాలు ఎక్కడంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఐసీయూలో రిషబ్ పంత్.. గాయాలు ఎక్కడంటే..

December 30, 2022

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆర్తితో ఆకాంక్షిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. అతని ఆరోగ్యం, గాయాలపై ప్రకటన విడుదల చేసింది. పంత్ క్షేమంగా ఉన్నాడని, స్పృహలోకి వచ్చాడని తెలిసింది. ‘‘ ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నుదుటిపై రెండు చోట్ల లోతైన గాయాలు అయ్యాయి. కుడి మోకాలిలో లిగమెంట్లో చిలిక వచ్చింది. కుడి మణికట్టుకు బొటనవేలికి, వీపు భాగంలో గాయాలయ్యాయి.

అతని ఆరోగ్య పరిస్థితిని మా మెడికల్ టీమ్ నిత్యం పర్యవేక్షిస్తోంది. కోలుకునేవరకు అండగా ఉంటాం’’ అని వివరించింది. పంత్ ప్రయాణిస్తున్న కారు ఉత్తరాఖండ్‌లోని రూర్కీ దగ్గర ప్రమాదానికి గురికావడం తెలిసిందే. అతనికి తొలుత స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించి తర్వాత మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు.