భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాదీ యువ క్రికెటర్ హనుమ విహారి.. పెళ్లిపీటలెక్కబోతున్నాడు. భాగ్యనగరానికి చెందిన పారిశ్రామిక వేత్త ఏరువ రాజేంద్రరెడ్డి కుమార్తె ప్రీతిరాజ్‌తో విహారి నిశ్చితార్థం జరగనుంది. మాదాపూర్‌లోని అవాస హోటల్లో ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ వేడుక నిర్వహించనున్నారు. వీరి నిశ్చితార్థానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.ఇటీవలే భారత టెస్టు జట్టులోకి తొలిసారిగా ప్రవేశించిన హనుమ విహారి వివాహం చేసుకుంటుండటంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వీడన్లో మాస్టర్స్ చేసిన ప్రీతి.. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తోంది.