2022వ ఏడాదికి సంబంధించిన భారత్ క్రికెట్ షెడ్యూల్ ముగిసింది. బంగ్లాదేశ్‌పై రెండో టెస్ట్‌లో ఘన విజయం సాధించి ఈ సంవత్సరానికి ముగింపు పలికింది. కొత్త సంవత్సరంలో సరికొత్తగా ముందుకు రానుంది. 2021 సంవత్సరంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC)ఫైనల్, T20 ప్రపంచ కప్‌లో నిరాశజనక ఫలితాలు తర్వాత కొత్త ఆశలతో భారత్ క్రికెట్ 2022లోకి అడుగుపెట్టింది. నాయకత్వం మార్పుతో నూతన సంవత్సర బరిలోకి దిగింది. విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడం..2021 చివరిలో చివరిలో రాహుల్ ద్రవిడ్ కోచ్ గా నియామకం అవ్వడంతో జట్టుపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే ఈ జోడి నేతృత్వంలో టీమ్ ఇండియా చాలా విషయాల్లో విఫలమైంది. వ్యూహం మరియు ఫిట్నెస్ వరకు తరుచు చేసిన ప్రయోగాలు బెడిసి కొట్టాయి. ఆసియాకప్, వరల్డ్ కప్ ఓటమి వంటివి 2022లో టీం ఇండియాకు పీడకలగా మిగిలాయి.
2002లో టీం ఇండియా టెస్ట్ ఫలితాలు
ఈ ఏడాదిలో ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన టీం ఇండియా నాలుగింట విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు 2–1 తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. కానీ, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు ఓటమి పాలైంది. దీంతోపాటు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
వన్డే ఫలితాలు
2022లో భారత్ 24 ODIలు ఆడింది, 14 గెలిచింది మరియు 8 ఓడిపోయింది. రెండిట్లో ఫలితం తేలలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. వర్షం కారణంగా ఈ న్యూజిలాండ్ సిరిస్‌లో ఒక వన్డే మాత్రమే జరిగింది. దాంట్లో న్యూజిలాండ్ విజయం అందుకుంది.
టీ20 ఫలితాలు
టీ 20 లో టీం ఇండియా అత్యుత్తమ ప్రదర్శనను అందించింది. 40 మ్యాచ్‌లు ఆడి వాటిలో 28 గెలిచింది. 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒకటి టైగా ముగిసింది. అయితే ద్వైపాక్షిక సిరీస్‌లో అదరగొట్టిన టీం ఇండియా ఇంటర్నేషనల్ టోర్నీల్లో మాత్రం బోల్తా పడింది. అనూహ్యంగా ఆసియా కప్‌లో సూపర్–4 నుంచి వైదొలిగింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై దారుణంగా ఓడిపోయింది.
స్వదేశి..విదేశి పిచ్‌లపై..
2022లో భారత్ స్వదేశంలో 25 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 19 గెలవగా 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. విదేశాలలో భారత్ 33 మ్యాచ్‌లు ఆడగా 18 గేమ్‌లు గెలిచి.. 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒకటి టైగా ముగిసింది. 2 మ్యాచ్‌ల్లో ఫలితాలు రాలేదు. తటస్థ వేదికలపై భారత్ 13 మ్యాచ్‌లు ఆడగా, 9 మ్యాచ్‌లు గెలిచి, 4 ఓడింది.
ఆసియా కప్‌లో ఓటమి
ఆసియాకప్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్ అనూహ్యంగా ఓటమి చవిచూసింది. వరుసగా రెండు నాకౌట్ ఓటములతో సిరీస్ నుంచి తప్పుకొంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, శ్రీలంక పైనా భారత్ ఓటమి చవి చూసింది. చివరికి ఆసియా కప్‌ను శ్రీలంక దక్కించుకుంది.
వరల్డ్ కప్ పరాభవం..
ఎన్నో ఆశలతో పొట్టి ప్రపంచకప్ బరిలోకి దిగిన టీం ఇండియా అసలు సిసలు పోరులో తడబడింది. సెమీస్‌లో ఇంటికి చేరింది. ఇంగ్లాండ్ పై ఓటమి చవిచూసి టోర్ని నుంచి నిష్క్రమించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో రోహిత్ సేన ఓటమి పాలైంది. ఈ టోర్నిలో పాక్‌పై భారత్ అద్భుతమైన విజయం అందుకుంది. విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటంతో పాక్‌ను ఓడించాడు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ టీ 20 వరల్డ్ కప్ టోర్నిలో ఆకట్టుకున్నారు. పాక్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ విజయం సాధించి కప్పును ముద్దాడింది.
కొత్త ఉత్సాహంతో 2023 లోకి
2023లో శ్రీలంక సిరీస్‌తో టీమ్ ఇండియా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. 2023లోనూ వన్డే ప్రపంచకప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ఫైనలిస్ట్‌ను నిర్ణయించే
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక సిరీస్‌లు ఉన్నాయి. వచ్చే ఏడాది టీం ఇండియా ఎలాంటి ఫలితాలు రాబట్టనుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి :
వార్నర్ అరుదైన రికార్డు..100వ టెస్ట్‌లో డబుల్ సెంచరీ..
బీఆర్ఎస్ లెక్క తేలింది.. 5 రెట్లు పెరిగిన ఆదాయం