కోహ్లీ రెస్టారెంట్‌లో క్రికెటర్ల సందడి   - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీ రెస్టారెంట్‌లో క్రికెటర్ల సందడి  

November 1, 2017

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, ఢిల్లీలో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. కీవిస్‌తో టీ 20 సిరీస్ కోసం ప్రస్తుతం భారత్ క్రికెట్ జట్టు ఢిల్లీలోనే ఉంది. ఈ సందర్బంగా క్రికెటర్లంతా మంగళవారం రాత్రి కోహ్లీ‌కి  చెందిన ‘ నుయేవా రెస్టారెంట్ ’లో సందడి చేశారు.

 అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ..‘ రెస్టారెంట్‌లోని సర్వీసులు బాగున్నాయని ధావన్ పేర్కొన్నాడు. ఈ రెస్టారెంట్‌కు వచ్చినవారు తప్పకుండా కోల్డ్ పిజ్జా ట్రై చేయండి అంటూ అక్షరపటేల్ అన్నాడు”  బుధవారం రాత్రి 7 గంటలకు భారత్-న్యూజిటాండ్ మధ్య తొలి మ్యాచ్  ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరగనుంది.