పదార్థాలు, భోజనం, పానీయాల కోసం ప్రేక్షకుల నుంచి ఆన్ లైన్ల సర్వేలు చేపట్టారు. అందరి ఓట్ల ఆధారంగా వంటకాల లిస్ట్ ను తయారు చేశారు. ఆ లిస్ట్ గురించి తెలుసుకోవాలి. ఈ సర్వే ప్రకారం 2022కి ప్రపంచంలోని అగ్రశ్రేణి వంటకాల్లో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది. భారతదేశంలో ఆహార ప్రేమికులు ఎక్కువ. ఆహారం భారతీయ సంస్కృతిలోనే అంతర్భాగమైంది. అంతేకాదు.. మన మసాలాలకు దేశంలోనే కాదు.. ప్రపంచం అంతా ప్రేమికులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు.. మూలాల నుంచి వండే వంటకాలు, ప్రత్యేకతలను ప్రయత్నించడానికి ఇష్టపడతారు. స్థానిక, ప్రాంతీయ వంటకాలు అంటూ ప్రసిద్ధి చెందాయి. ఇతర రాష్ఱాలు, ప్రాంతాల నుంచి ఆహారాన్ని ప్రయత్నించడం కూడా ఆనందిస్తారు. ‘భారతీయ వంటకాలు’ అనే పేరు వినగానే అందరికీ నోట్లో నీళ్లూరుతాయి.
టాప్ లో..
టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ ద్వారా 2022లో ప్రపంచంలోనే ఐదవ అత్యుత్తమ వంటకాలను కలిగి ఉన్న దేశంగా భారతదేశం నిలిచింది. ఇది పదార్థాలు, వంటకాలు, పానీయాల కోసం వినియోగదారుల ప్రాధాన్యతలపై దాని స్థానాన్ని ఆధారం చేసుకుంది. ఇటలీ ఇప్పుడు టాప్ ర్యాంకును కలిగి ఉండగా, గ్రీస్ రెండవ స్థానంలో ఉంది. తర్వాత స్పెయిన్, జపాన్ లు ఉన్నాయి. భారతదేశం టేస్ట్ అట్లాస్‌లో 4.54 స్కోర్ ను సంపాదించింది.
వంటకాల లిస్ట్..
ఉత్పత్తి చేసిన 411 వంటకాల్లో రోటీ, నాన్, చట్నీ, బటర్ గార్లిక్ నాన్, కీమా, తందూరీ, షాహీ పన్నీర్, పన్నీర్ టిక్కా, మలై కోఫ్తా స్థానాన్ని సంపాదించాయి. ఇంకా బటర్ చికెన్ కొన్ని వంటకాలు ఉన్నాయి. పరాఠా, రసగుల్లా, పూరీ, మసాలా, దోశ, కాజు కత్లీ అందరూ మెచ్చిన వంటకాల లిస్ట్ లో ఉన్నాయి. ఇవికాకుండా.. మసాలా చాయ్, లస్సీ, మ్యాంగో లస్సీ, జిన్, స్వీట్ లస్సీ, సౌత్ ఇండియన్ కాఫీ, అస్సాం టీ, గాజర్ కా దూద్, ఠండాయి, హల్డీ దూద్ వంటి అత్యుత్తమ రేటింగ్ పొందిన భారతీయ పానీయాలు. సమోసా, పానీ పూరీ, పాపడ్, పకోరా, పాప్రీ చాట్, మేడు వడ, ఆలూ టిక్కీ, ఢోక్లా, మురుక్కు, దాబేలీ.. ఇతర స్నాక్స్ కూడా ఉన్నాయి. ఈ జాబితాలో శ్రీ థాకర్ భోజనాలయ్ (ముంబై), కరవల్లి (బెంగళూరు), బుఖారా (న్యూఢిల్లీ), దమ్ పుఖ్త్ (న్యూఢిల్), కొమోరిన్ (గురుగ్రామ్) వంటి 450 అదనపు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో తెలుసా?
అత్యధికంగా భక్తులు సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండవ స్థానం..మొదటిస్థానంలో…