రద్దైన పెద్ద నోట్లు మార్చుకునేందుకు ఇంకో ఛాన్స్ - Telugu News - Mic tv
mictv telugu

రద్దైన పెద్ద నోట్లు మార్చుకునేందుకు ఇంకో ఛాన్స్

June 22, 2017

రద్దైన పాత నోట్లు మీతాన ఉంటే  గనుక ఏ ఇబ్బందీ లేదు. మళ్లీ మార్చుకునే వెసులు బాటు కల్పించింది ఆర్బీఐ.  అక్కడక్కడా ఇంకా పాత నోట్లు మారుస్తూ కొందరు పట్టుబడుతున్నారు. రద్దైన నోట్లున్నోళ్లను ఎందుకు  అరెస్టు చేస్తున్నరో జనాలకూ అర్థం కావడం లేదు.  రద్దైన నోట్లకు విలువ  కూడా ఉండదు కదా. అలాంటప్పుడు  అరెస్టులు ఏమిటో మరి. దీనికైతే ఖచ్చితమైన సమాధానం లేదు. అనుమానాల మాట అటుంచితే… రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్ల వద్ద కొత్త  నోట్లు  లేవు. అందుకు గ్రామీణ, వ్యవసాయ సంబంధమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని రద్దైన పాత నోట్లు కలిగి ఉన్న బ్యాంకులు, ఫోస్టాఫీసులకు నోట్లు మార్చుకునే అవకాశం ఇచ్చింది. మరి దీన్ని ఎట్లా వాడుకుంటరో చూడాలి. రద్దైన నోట్లకు మల్లా మళ్లా  మార్చుకునేందుకు ఇన్ని ఛాన్స్ లు ఇవ్వకుండా ఏదో నిర్ణయం అప్పుడే తీసుకుంటే పోయేది కదా.