Indian diplomat Mijito Vinito slams Pakistan PM Shehbaz Sharif at UNGA
mictv telugu

ఐరాస వేదికగా పాక్ ప్రధాని ‘నీతులు’.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్

September 24, 2022

Indian diplomat Mijito Vinito slams Pakistan PM Shehbaz Sharif at UNGA

ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్కు భారత్ దిమ్మతిరిగి పోయేలా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితిలో నిన్న పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్‌పై భారత దౌత్యవేత్త మిజితో వినిటో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉందని, పొరుగు దేశాలతో పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని ఆరోపించారు. తమ పొరుగు వారితో తాము శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పుకునే పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా ఉండాలని భారత రాయబారి కోరారు. ముంబయి నగరంలో పాక్ ఉగ్రవాదులు భయంకరమైన దాడులు చేశారని మిజితో చెప్పారు

నిన్న ఐక్యరాజ్యసమితో పాక్ ప్రధాని మాట్లాడుతూ.. కశ్మీర్ అంశానికి పరిష్కారం లభిస్తేనే ఇండియాతో శాంతిపూర్వక బంధాలు నెలకొంటాయని అన్నారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాలని… యుద్ధం ఒక పరిష్కారం కాదని అన్నారు. కేవలం శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇండియా మండిపడింది. టెర్రరిజంను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ శాంతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేసింది. ఇండియాకు వ్యతిరేకంగా తప్పుడు వ్యాఖ్యలు చేసేందుకు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకోవడం దారుణమని చెప్పింది. సొంత దేశాన్నే చక్కదిద్దుకోలేని వ్యక్తి… ఇండియా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపింది.