చెప్పుల డబ్బాలపై జాతీయ జెండా...! - MicTv.in - Telugu News
mictv telugu

చెప్పుల డబ్బాలపై జాతీయ జెండా…!

August 26, 2017

చైనా వస్తువులను బహిష్కరించాలని మన దేశమతటా జోరుగా నినాదాలు వినిపిస్తున్నాయి.  అయితే చైనా మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా భారత్ పై మరింత  విద్వేషాన్ని వెళ్లగక్కుతోంది.

తాజాగా ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని  అల్మోరాకు చెందిన  ఓ చెప్పుల వ్యాపారి.. చైనా చెప్పులను, షూలను ఆర్డర్ చేశాడు. అయితే డెలివరీ అయిన  షూ ,చెప్పుల బాక్సులను చూసి కంగు తిన్నాడు.  ఆ బాక్సులపై భారతీయ జాతీయ జెండా ఉందట. వెంటనే ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

షూ, చెప్పుల బాక్సులపై జాతీయ జెండాల ముద్రించి భారతీయుల మనోభావాలను చైనా దెబ్బతీసిందని వెంటనే చర్య తీసుకోవాలని ఆ వ్యాపారి పోలీసులను కోరారు.  దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. .

ఈ డబ్బాల ఫోటోలను చూసిన నెటిజన్లంతా చైనాకు మరీ ఇంత బలుపేంటని  తిడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.