Home > Featured > అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా

అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా

స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ అనే సంస్థ బెలూన్ సాయంతో 1,06,000 అడుగుల ఎత్తుకి జాతీయ జెండాను పంపి ఆవిష్కరించింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. స్పేస్ కిడ్జ్ ఇండియా.. దేశానికి యువ శాస్త్రవేత్తలను అందించేందుకు కృషి చేస్తున్న సంస్థ. హద్దులు లేని ప్రపంచం కోసం చిన్నారుల్లో అవగాహన కల్పిస్తోంది.

దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ అంతరిక్షం నుంచి కూడా సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.. భారతీయ అమెరికన్ వ్యోమగామి రాజాచారి కూడా ఆసక్తికర ఫొటోలు షేర్ చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రవాస భారతీయుడిగా తన తండ్రి నగరమైన హైదరాబాద్ ఎలా వెలిగిపోతోందో అంతరిక్షం వీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. భారతీయ అమెరికన్లు నిత్యం పురోగమిస్తున్న వాటిలో నాసా కూడా ఒకటని అన్నారు. ఈ సందర్భంగా అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని ఆవిష్కరించిన ఫొటోలను షేర్ చేశారు.

Updated : 15 Aug 2022 2:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top