indian government bans 26 drugs
mictv telugu

క్యాన్సర్ కారక ట్యాబ్లెట్లను నిషేధించిన కేంద్రం.. వాటి లిస్టు ఇదిగో

September 13, 2022

క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్న 26 ఔషధాలను కేంద్రం నిషేధించింది. అత్యవసర జాబితా నుంచి జింటాక్, ర్యాంటాక్ ట్యాబ్లెట్లను తొలగించింది. ఎసిడిటీ సంబంధిత సమస్యలకు వాడే వీటితో క్యాన్సర్ ముప్పు ఉందనే అనుమానాలున్నాయని పేర్కొంది. వాటితో పాటు మరో 26 రకాల మందులను దేశ మార్కెట్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ 384 ఔషధాలను కలిగి ఉన్న కొత్త నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్‌ను విడుదల చేయగా ఆ జాబితా నుంచి 26 మందులను తప్పించింది.

నిషేధం విధించిన మందుల జాబితా ఇదీ

ఆల్టేప్లేస్, అటెనోలోల్, బ్లీచింగ్ పౌడర్ కాప్రోమైసిన్, సెట్రిమైడ్, క్లోర్ఫెనిరమైన్, డిలోక్సనైడ్, ప్యూరోయేట్, డిమోర్కాపోల్, ఎరిత్రోమైసిన్, ఇథినైల్ట్ర్సాడియోల్, ఇథినైల్ట్ర్సాడియోల్ (ఎ) నోరెథిస్టిరాన్ (బి), నికోటినామైడ్, మిథైల్డోపా, గాన్సిక్లోవిర్, కనామైసిన్, లామివుడిన్ (ఎ) నెవిరాపైన్ (బి) స్టావుడిన్ (సి), లెఫ్లునోమైడ్, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ అల్ఫా 2a,పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ అల్ఫా 2బి, పెంటమిడోన్, ప్రిలోకైన్ (ఎ) లిగ్నోకైన్ (బి), ప్రోకార్బనైజైన్, రానిటిడిన్, రిఫాబుటిన్, స్టావుడిన్ (ఎ) లామివుడిన్ (బి), సుక్రాల్ ఫేట్, వైట్ పెట్రోలేటం.