indian Government decides for free distribution of booster dose
mictv telugu

ఎల్లుండి నుంచి బూస్టర్ డోస్ ఉచిత పంపిణీ.. ఎప్పటివరకంటే..

July 13, 2022

కరోనా వైరస్‌ నుంచి రక్షించుకోవడానికి ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసిన కేంద్రం మూడో డోసు విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బూస్టర్ డోసుగా పిలిచే ఈ డోసును శుక్రవారం నుంచి దేశ వ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించింది. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఈ ప్రికాషన్ డోసును అందించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా రెండున్నర నెలల పాటు ఈ డోసులను ప్రజలకు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ బూస్టర్ డోసు నిర్ణీత ధరల వద్ద కేవలం ప్రైవేటు కేంద్రాల్లోనే అందుబాటులో ఉండేది. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.