ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయం సూచించిన కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయం సూచించిన కేంద్రం

July 2, 2022

పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువులను కేంద్రం జులై 1 నుంచి నిషేధించిన విషయం తెలిసిందే. అయితే వాటికి బదులు ఏం వాడాలి? ప్రత్యామ్నాయాలేంటి? అనే విషయాలను చెప్పలేదు. తాజాగా అందుకు సంబంధించిన పలు సూచనలు జారీ చేస్తూ కేంద్రం ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసింది. దాని ప్రకారం.. ప్లాస్టిక్ బదులు వెదురుతో తయారు చేసిన స్ట్రాలు, చెంచాలు వాడాలి. మళ్లీ వాడుకునేలా ఉండే కప్పులు, స్టీలు గ్లాసులు, గాజు గ్లాసులు వాడాలి. స్టెయిన్ లెస్ స్టీల్ స్ట్రాలు, లంచ్ బాక్సలు వాడాలి. వెదురు ఇయర్ బడ్స్, ద్రవ రూపంలో ఉండే ఇయర్ కేర్ ఉత్పత్తులను వాడాలి. బజారుకు వెళ్లినప్పుడు సంచీలు లేదా ఖాదీ బ్యాగులు తీసుకెళ్లాలి. పై సూచనలతో పాటు దేశ భవిష్యత్తు కోసం మీ జీవితంలోంచి ప్లాస్టిక్‌ను దూరం పెట్టండి అంటూ వీడియో ముగించింది. అయితే కేంద్రం చెప్పింది బాగానే ఉన్నా ప్రత్యామ్నాయ వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా అనేది ముఖ్యమైన ప్రశ్న. మరి కేంద్రం సూచన ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.