ముద్దు పెడతాడా.. అప్పుడే పోలీసులను పిలవాలనుకున్నా..  - MicTv.in - Telugu News
mictv telugu

ముద్దు పెడతాడా.. అప్పుడే పోలీసులను పిలవాలనుకున్నా.. 

October 22, 2019

రియాలిటీ షోలల్లో చూపించే వివాదాలు నిజమేనా అని ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తిట్టడం, కొట్టుకోవడం, ఏడవటం ఇదంతా గేమ్‌లో ప్లాన్ ఏమోననే అనుమానాలను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. మొన్న సోనీటీవీలో ప్రసారం అవుతున్న ‘ఇండియన్ ఐడల్ 11’ కార్యక్రమంలో గాయని నేహా కక్కర్‌ను కంటెస్టెంట్ ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ వీడియోకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. అయితే దానిపై ఆ షోలో అనుమాలిక్, నేహా కక్కర్‌లతో మరో జడ్జిగా వ్యవహరిస్తున్న విశాల్‌ దడ్లాని సీరియస్ అయ్యారు. కిస్ ఘటన జరుగుతున్నప్పడు ఆయన అక్కడే వున్నారు.  ట్విటర్‌లో ఆయన ఘాటుగా స్పందిస్తూ.. ‘కంటెస్టెంట్‌ చేసిన పనికి పోలీసులను పిలుద్దామని నేహాకక్కర్‌కు చెప్పాను. కానీ ఆమె ఈ విషయాన్ని ఇక్కడితో మరిచిపోవాలని తనను వారించింది. అతనికి మానసిక చికిత్స అవసరం ఎంతో ఉంది. మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహించాలని షో నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని కోరాను’ అని పేర్కొన్నాడు.

అయితే ఆయన పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీరు అప్పుడే అతని చెంప పగలగొట్టాల్సింది. ఓ మహిళా జడ్జిని పట్టుకుని అంతమందిలో ముద్దు పెట్టుకుంటాడా?’ అని కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. మరి కొందరు మాత్రం.. ‘ఇదంతా టీవీ షో స్ట్రాటజీ. ప్రోగ్రాం టీఆర్‌పీ పెంచుకోవడానికి మీరు చేస్తున్న వివాదం ఇది’ అని అంటున్నారు. ‘మొత్తానికి మన కళాకారుడు మామూలు కళాకారుడు కాదుగా. చేతిపై నేహా కక్కర్ పేరు రాసుకున్నాడు. దొరికిన అవకాశాన్ని బాగా వాడుకున్నాడు’ అంటూ మరికొందరు చమత్కరిస్తున్నారు.