రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన బుడ్డోడు - MicTv.in - Telugu News
mictv telugu

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన బుడ్డోడు

February 6, 2020

lottry

ఉపాధి వేట కోసం గల్ఫ్ వెళ్లిన ఓ భారతీయుడికి కొడుకు రూపంలో అదృష్టం వచ్చింది. ఏకంగా రూ. 7 కోట్ల విలువ చేసే లాటరీ తగలడంతో అతని సంతోషానికి అవుదులు లేకుండా పోయాయి. రమీస్ రహ్మాన్ అనే వ్యక్తి దుబాయ్‌లో ఈ అదృష్టం వరించింది. ఈ విషయం తెలిసిన అతడు తెగ సంతోషపడిపోతున్నాడు. ఈ డబ్బుతో తన కుమారుడి భవిష్యత్‌ కోసం ఉపయోగిస్తానని చెబుతున్నాడు. 

రమీస్ రహ్మాన్ అనే భారత పౌరుడు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల లాటరీ టికెట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తన ఏడాది వయసున్న కొడుకు మహ్మద్ సాలా పేరుమీద టికెట్ కొన్నాడు. తర్వాత దాన్ని అతడు మర్చిపోయాడు. ఈ లాటరీ తీసిన ఆ సంస్థ రమీస్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్టు వెల్లడించింది. రాత్రికి రాత్రే ఆ కుటుంబం దశ మారడంతో అంతా సంతోషంలో మునిగిపోయారు.  కాగా గత కొన్ని రోజులుగా భారతీయులు లక్కీడ్రాలో తమ అదృష్టాన్ని నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇటీవల పలువురికి లాటరీ టికెట్లు తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిన సంగతి తెలిసిందే.