భారతీయుడికి 500 ఏళ్ల జైలు శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయుడికి 500 ఏళ్ల జైలు శిక్ష

April 11, 2018

పోంజీ కుంభకోణంలో ఓ భారతీయుడికి యూఏఈలోని కోర్టు ఏకంగా 500 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గోవాకు చెందిన సిడ్నీ లెమోస్, అతని అకౌంటెంట్ ర్యాన్ డిసౌజాకు దుబాయ్ కోర్టు ఈ శిక్ష వేసింది. 120 శాతం వార్షిక ప్రతిఫలం ఇస్తామని మదుపర్లను వీరు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.వీరు ఎక్స్‌టెన్షియన్ కంపెనీ సేరుతో మొత్తం 20 కోట్లను ప్రజల నుంచి సేకరించి బోర్డు తిప్పారని ఆరోపణలు ఉన్నాయి. కనిష్ట పెట్టుబడిగా 25 వేల డాలర్లను ఒక్కొక్కరి నుంచి వసూలు చేశారు.