టెన్షన్‌లో ఊరట.. 7 కోట్లు గెల్చుకున్న భారతీయుడు - MicTv.in - Telugu News
mictv telugu

టెన్షన్‌లో ఊరట.. 7 కోట్లు గెల్చుకున్న భారతీయుడు

October 27, 2019

raffle...

వ్యాపారం దెబ్బతిని తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఓ భారతీయుడికి లక్కీ లాటరీ తగిలింది. దెబ్బకు దరిద్రం తొలిగింది. రూ.7 కోట్లకు పైగా లాటరీ సొమ్ము రావడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఆయన పేరు కమలాసనన్ నాడార్ వాసు(56). దుబాయ్‌లో 30 ఏళ్లుగా ఉంటున్న వాసు.. అక్కడే స్టీల్ ఫ్యాబ్రికేషన్ కంపెనీ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. బాగానే సాగిన వ్యాపారం ఏడాది కాలంగా దెబ్బతింది. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో వ్యాపారాన్ని కొనసాగించాలా.. మూసేయ్యాలా అనే డోలాయమానంలో పడ్డారు వాసు. నిద్రాహారాలు మానుకుని రాత్రింబవళ్లు వ్యాపారం గురించే దిగులు చెందసాగారు. ఈ క్రమంలో ఆయన జీవితంలో పెనుమార్పు చోటు చేసుకుంది. 

రాత్రికి రాత్రే ఆయనను లాటరీ వరించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లాటరీలో ఆయన గెలిచారు. ఆయనకు రూ.7 కోట్ల సొమ్ము దక్కింది. వాసుతో పాటు కజికిస్థాన్‌కు చెందిన ఖుస్సేన్ యేరెమెషేవ్ అనే వ్యక్తికి కూడా రూ.7కోట్ల లాటరీ తగిలింది. ఆయన టెన్సన్లు అన్నీ మటుమాయం అయ్యాయి. ఈ లాటరీ తగలడం పట్ల ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ డబ్బుతో తన జీవితం సాఫీగా సాగిపోతుందని వాసు ఆనందం వ్యక్తం చేశారు. దెబ్బతిన్న వ్యాపారాన్ని ఈ సొమ్ముతో చక్కదిద్దుకుంటానని తెలియజేశారు. వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చేస్తానని అన్నారు.