చైనా అమ్మాయితో ఇండియన్ పెళ్లి..కరోనా టెస్టులు చేశాకే - MicTv.in - Telugu News
mictv telugu

చైనా అమ్మాయితో ఇండియన్ పెళ్లి..కరోనా టెస్టులు చేశాకే

February 3, 2020

nbfvvf

 

కరోనా వైరస్ చైనాను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. చైనా నుంచి విదేశాలకు దాదాపు రాకపోకలు స్తంభించాయి. ఇప్పటికే ఈ వైరస్ 25 దేశాలకు వ్యాపించింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో నివాసముంటున్న విదేశీయులు, చైనావాసులకు ఈ-వీసాల జారీని నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల 15వతేదీ నుంచి చైనా నుంచి భారత దేశానికి వచ్చిన వారు ఎవరైనా వారిని నిర్బంధించి ఆసుపత్రుల్లోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులకు తరలించింది.

అయితే ఈ ఆదివారం మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి.. చైనా అమ్మాయిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి జరిగినప్పుడు.. చైనాను కరోనా వణికిస్తుంటే ఇతనేమో అక్కడమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని స్థానికులు ఒకింత కంగుతిన్నారు. అయితే.. వధువు తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌కు రాగా వారికి ఐదుగురు వైద్యులతో కూడిన బృందం కరోనా టెస్ట్‌లు చేసింది. ఈ పరీక్షల్లో కరోనా లక్షణాలు ఏమీ లేవని.. తేలినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వరుడు, వధువు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.