కొన్ని పనులు చేయాలంటే ఎంతో ఓర్పు కావాలి. చాలా కష్టపడాలి. లక్ష్యమే గమ్యంగా పోరాడాలి. అలా అయితేనే దాన్ని సాధించగలుగుతాం. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చనా అనుకున్నది సాధించగలుగుతాం. అలాంటి పనే ఒక భారతీయుడు సాధించి నిరూపించాడు. చాలా మందికి సాధ్యం కాని డెలీరియస్ వెస్ట్ మారథాన్ విజేతగా నిలిచి అనుకున్నది సాధించడమే కాక అందరి కంటే భిన్నంగా, ఎత్తులో నిలిబడి చూపించాడు. ఆస్ట్రేలియాలో జరిగే డబ్ల్యూఈఎస్టీ మారథాన్ చాలా ఫేమస్. 350 కిలోమీటర్ల మారథాన్ ఇది. దీన్ని ఎటంప్ట్ చేయాలనుకోవడమే ఒక పెద్ద సాహసం అసలు. అలాంటి దానిలో విజేతగా నలివడం అంటే మాత్రం మాటలు కాదు.
సుకాంత్ సుఖి….డెలీరియస్ వెస్ట్ మారథాన్లో విజేతగా నిలిచిన వ్యక్తి. ఇతను 350 కిలోమీటర్ల దూరాన్ని 102 గంటల 27 నిమిషాల్లో చేరుకున్నాడు. దీంతో ఇతను ప్రపంచంలో 200 మైళ్ళను చేధించిన టాప్ 10 లో ఒకడిగా నిలిచాడు. ఈ విషయం స్వయంగా డెలీరియస్ వెస్ట్ తన వెబ్ సైట్ లో తెలిపింది. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు ఈ మారథాన్ పోటీలు జరిగాయి.
మారథాన్ ను గెలవడం సుకాంత్ కు అంత ఈజీగా ఏమీ అయిపోతేలు. మధ్యలో అతను ఎన్నో కష్టాలను, సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నింటినీ అతను వీడియోగా తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు. నా జీవితంలో చేసిన అత్యంత కష్టమైనది ఇదే. మిగిలిన జీవిత కాలం మొత్తం ఇది గుర్తుండిపోతుంది. ప్రమాదకరమైన అడవిలో 350 కిలోమీటర్లు పరుగు తీయడం సాధ్యమేనా? అంటూ పోస్ట్ లో రాసుకున్నారు సుకాంత్. ఏది ఏమైనా అతను సాధించినది మాత్రం మామూలు ఘనత కాదు.