అమెరికాలో వందలాది దొంగ పెళ్లిళ్లు.. తెలుగోడికి 20 ఏళ్ల జైలు! - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో వందలాది దొంగ పెళ్లిళ్లు.. తెలుగోడికి 20 ఏళ్ల జైలు!

March 16, 2019

ఏం చేసైనా సరే అమెరికాకు వెళ్లాలనుకునే వారి బలహీనతలను ఆసరా చేసుకుని కొందరు అక్రమాలకు తెరతీస్తున్నారు. ఏకంగా అమెరికాలోనే మకాం వేసి అవినీతికి పాల్పడుతున్నారు. అమెరికన్లకు వందలాది విదేశీయులతో దొంగ పెళ్లిళ్లు జరిపించి, తద్వారా అక్కడ నివసించడానికి సాయపడిన రవిబాబు కొల్లా(47) అనే తెలుగు వ్యక్తి తన నేరం ఒప్పుకున్నాడు. ఒక్క అలాబామాలే 80 దొంగ పెళ్లిళ్లు చేసినట్లు అంగీకరించాడు.

Indian Man Detained For Running Fake Marriage Racket In US For Visa.

 

టాలిహాసీ  కోర్టులో అతణ్ని దోషిగా తేల్చింది. మే 22న శిక్ష ఖరారు చేయనుంది. అడ్డదారుల్లో వీసాలు, పెళ్లిళ్లు వంటి నేరాలకు పాల్పడినందుకు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. దాంతోపాటు అక్రమ లావాదేవీల కేసులో గరిష్టంగా 20ఏళ్ల శిక్ష పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. దొంగ పెళ్లిళ్ల స్కామ్‌లో రవిబాబుతో చేతులు కలిపిన అమెరికన్ మహిళ క్రిస్టల్‌ క్లౌడ్‌కు ఇది వరకే తన నేరాన్ని ఒప్పుకుంది. ఆమెకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. అక్రమాల్లో భాగంగా ఆమె కూడా ఓ దొంగపెళ్లి చేసుకుంది. పనామాసిటీ, కల్హౌన్‌, జాక్సన్‌కౌంటీలకు చెందిన అమెరికన్లతో చాలా మంది విదేశీయులకు పెళ్లిళ్లు చేసింది.