భారతీయ వ్యక్తి ఆదిత్యజిత్ షెర్గిల్ కెనడాలోని నెట్ ఫ్లిక్స్ పబ్లిక్ రిలేషన్స్ టీమ్ లో జాబ్ ఓపెనింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతను మామూలు రెజ్యుమె కాకుండా నెట్ ఫ్లిక్స్ ట్రైలర్స్ తో తన రెజ్యుమె వీడియోను రూపొందించాడు.
రెజ్యుమె తయారు చేయడం అనేది ఒక కల. అది అందరికీ చేతకాదు. కొత్త కొత్తగా చేయడానికి చూస్తుంటారు. చాలావరకు రెజ్యుమెని చూసి కూడా ఉద్యోగం ఇస్తుంటాయి కంపెనీలు. అంత ఉంటుంది. మరి అందరిలా తాను చేస్తే ఏముంటుందిలే అనుకున్నాడో యువకుడు. సరికొత్తగా ఆలోచించి రెజ్యుమెని వీడియో రూపంలో చేశాడు. అదికూడా నెట్ ఫ్లిక్స్ ట్రైలర్ లతో..
https://www.linkedin.com/posts/banyan-netfaqs-pvt-ltd–afaqs–_netflix-resume-activity-7013786271625953280-GazM?utm_source=share&utm_medium=member_ios
నెట్ ఫ్లిక్స్ లో..
కెనడాలో నివాసముంటున్న ఆదిత్య కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ గా పనిచేశాడు. అయితే నెట్ ఫ్లిక్స్ లో ఉద్యోగం సంపాదించాలని అనుకున్నాడు. దానికోసం మామూలు దరఖాస్తు చేస్తే లాభం ఏముంటుందని అనుకున్నాడు. అందుకే నెట్ ఫ్లిక్స్ ట్రైలర్ లను ఉపయోగించి స్వంత ట్రైలర్ ను రూపొందించాడు. కెనడా పీఆర్ కో ఆర్డినేటర్ కోసం.. ‘నెట్ ఫ్లిక్స్ లో ఇదిగో నా షూట్ చేస్తున్నాను’ అని ఆదిత్యజిత్ షెర్గిల్ లింక్డ్ ఇన్ లో రాశాడు. ఆదిత్యజిత్.. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడు. అతను రెప్ఇండియా తో పబ్లిక్-కమ్యూనికేషన్ మేనేజర్ గా పని చేశాడు. అక్కడ అతను కెనాన్, సెఫోరా, టెండర్, గ్యాప్, బర్గర్ కింగ్, అదానీ, జేఎస్ డబ్ల్యూ వంటి కొన్ని పెద్ద బ్రాండ్ లకు పని చేశాడు. ఆ తర్వాత ఓయూతో కలిసి గ్లోబల్ బ్రాండ్ కు అసోసియేట్ మేనేజర్ గా ఉన్నాడు.
నెటిజన్ల నుంచి..
అతను చేసిన పోస్ట్ కి ఇప్పటివరకు నెటిజన్ల నుంచి భారీ స్పందన పొందాడు. అతని సృజనాత్మకతకు అందరూ హ్యాట్సాఫ్ చేస్తున్నారు. అతని ప్రతిభ చూసినవాళ్లంతా.. ‘నెట్ ఫిక్ల్స్ లో ఉద్యోగం తప్పకుండా వస్తుంది, వాళ్లు నియమించుకుంటారు. మీ కలల పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ కామెంటుతున్నారు.