యూట్యూబ్ వీడియోలకు కరోనా వైరస్ - MicTv.in - Telugu News
mictv telugu

యూట్యూబ్ వీడియోలకు కరోనా వైరస్

March 30, 2020

Indian Mobile Users to Get YouTube Videos at 480p Till lockdown ends

కరోనా మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కాలక్షేపం కోసం యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ ఎఫెక్ట్‌ యూట్యూబ్‌ వీడియో క్వాలిటీపై పడింది. లాక్‌డౌన్ కారణంగా ఇంటర్‌నెట్‌ వినియోగం పెరిగిపోయింది. దీంతో ఇంటర్‌నెట్‌ రవాణా వ్యవస్థపైన ఒక్కసారిగా భారం పడింది. 

ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌ మొదలగు వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, వీడియో క్వాలిటీని తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో యూట్యూబ్ కూడా వీడియో క్వాలిటీని తగ్గించింది. భారత్‌లో ఆండ్రాయిడ్‌ మొబైల్‌లలో యూట్యూబ్ వీడియోలు వీక్షించే యూజర్లకు క్వాలిటీని 480 పిక్సల్‌లకు తగ్గించింది. ఎలాంటి ఇంటర్నెట్‌ కనెక్షన్‌‌తో అయినా ఆండ్రాయిడ్‌ మొబైల్‌లలో యూట్యూబ్ వీడియోల క్వాలిటీ 480 పిక్సల్‌లకు మించి ప్లే కాదు. అయితే డెస్క్‌టాప్‌లో యూట్యూబ్‌ వీక్షకులకు మాత్రం ఎప్పటిలానే హై క్వాలిటీతో వీడియోలు వీక్షించవచ్చు.