Indian movies and artists held guiness world record
mictv telugu

ఈ సినిమాలు.. నటులు రికార్డుల్లోకెక్కారు!

November 21, 2022

ప్రపంచంలోని అద్వితీయ విజయాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యాయి. అంతేకాదు.. భారతీయ సినిమాలు, వ్యక్తులు కూడా ఈ రికార్డుల్లో పేరు సంపాదించారు. ఇప్పటివరకు రికార్డ్‌లకు ఎక్కిన వాళ్ల గురించి, సినిమాల గురించి ఈ ప్రత్యేక కథనం..

ఆశాభోంస్లే


ఆశాభోంస్లే 2011లో ఈ ఘనత సాధించారు. అప్పటివరకు ఆమె దాదాపు 20 భాషల్లో 11వేల పాటలను రికార్డు చేశారు. 1947నుంచి ఈమె పాటల ప్రస్థానం మొదలైంది.

బాహుబలి


ఈ సినిమా తెలుగు సినిమానే కాదు.. ఇండియన్ సినిమాను వైపు చూపు తిప్పుకొనేలా చేసింది. ఈ సినిమాను రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే కోచ్చి గ్లోబల్ యునైటెడ్ మీడియా కంపెనీ 50వేల స్క్వేర్ ఫీట్ పోస్టర్ని తయారుచేసింది. అందుకే ఈ సినిమా అలా రికార్డుల్లోకెక్కింది.

సమీర్ అంజన్


ఆయన సినీ గేయ రచయిత. సావరియాలోని జబ్ సే తేరే నయనా,తుమ్ పాస్ అయే(కుచ్ కుచ్ హోతా హై, నజర్ కే సామనే (ఆషికీ) ఆయన గోల్డెన్ హిట్ సాంగ్స్. ఆయన 15 డిసెంబర్ 2015 వరకు 3, 524 పాటలను రాశారు. ఇప్పటి వరకు ఇన్ని పాటలు రాసిన ఘనత ఎవరూ సాధించలేదు.

కహో నా ప్యార్ హై


హృతిక్ రోషన్ మొదటి సినిమా ఇది. దీన్ని ఆయన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. ఈ సూపర్ హిట్ సినిమాకి 92 అవార్డులను గెలుచుకుంది. ఫిల్మ్‌ఫేర్, స్టార్ స్క్రీన్, జీ సినీ అవార్డ్, ఐఫా.. ఇలా రికార్డులను గెలుచుకొని 2002లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో ఈ సినిమా పేరు నమోదు చేసుకుంది.

కుమార్ సాను


బాలీవుడ్లో కుమార్ సాను పేరు తెలియని వారుండరు. 90వ దశకంలో ఆయన సూపర్ సింగర్. 93లో ఒకేరోజు 28 పాటలను రికార్డులను చేయడంతో ఈ సూపర్ ఫీట్ సాధించారు.

జగదీష్ రాజ్


ఈయన విలక్షణ నటుడు. బాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించాడు. కానీ ఆయన 144 సినిమాల్లో పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్ చేశారు. అలా గిన్నీస్ రికార్డుల్లో పేరు సంపాదించారు.

కపూర్ ఫ్యామిలీ


ఈ కుటుంబం నుంచి ఇప్పటి వరకు 24మంది ఆర్టిస్టులు వచ్చారు. 1929లో పృథ్వీరాజ్ కపూర్ ఆయన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత రాజ్ కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్ ఆయన వారసులుగా వచాచరు. రణ్‌బీర్, కరీనా ఇప్పుడు ఈ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే. ఏ కుటుంబం నుంచి ఇంతమంది కళాకారులు లేకపోవడం విశేషం. 1999లో ఈ కుటుంబాన్ని రికార్డుల్లోకి ఎక్కించారు.

యాదేన్ (1964)


సునీల్‌దత్ ఈ సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆయనే హీరో. ఈ సినిమాలో నర్గీస్‌దత్ కూడా నటించారు. కాకపోతే ఇందులో ఆమె నీడ మాత్రమే కనిపిస్తుంది. ఇలా ఒక్కరితోనే తీసిన మొదటి సినిమాగా రికార్డల్లోక్కెకింది.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ

ప్రపంచంలో అతిపెద్ద ఇండస్ట్రీ మనదే. సంవత్సరానికి కనీసం 800 నుంచి వెయ్యి సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ లెక్క అన్ని భాషల్లో కలిపి. 2008లో 24 భాషల్లో 1,288 సినిమాలు విడుదలయాయయి. అదే సంవత్సరంలో హాలీవుడ్లో కేవలం 606 సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. అలా మన సినిమా ఇండస్ట్రీ రికార్డులకెక్కింది.

అశోక్ కుమార్


1936లో జీవన్ నయా సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. మొత్తం 63 సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో కొనసాగారు. 1980లో ఆయన చివరిసారిగా ఒక టీవీ షోలో కనిపించారు. బాలీవుడ్లో సుదీర్ఘ కెరీర్ కలిగిన నటుడు ఈయన.

పీకే (2014)


రాజ్‌కుమార్ హీరానీ దర్శకత్వం చేసి, ఆమీర్‌ఖాన్ నటించిన సినిమా పీకే. ఈ సినిమా విదేశాల్లో సైతం విడుదలయింది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 792కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు మరో దేశంలో అధిక వసూళ్లను చేసిన మొదటి భారతీయ చిత్రంగా ఈ సినిమా రికార్డుల్లోకెక్కింది.

లవ్ అండ్ గాడ్ (కైస్ ఔర్ లైలా)


అతి ఎక్కువ కాలం నిర్మాణంలో ఉన్నసినిమా ఇది. 20 సంవత్సరాలు ఈ సినిమా నిర్మాణం జరిగింది. 1971లో గురుదత్ హీరోగా, కె. ఆసిఫ్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మాణం జరిగింది. వారి చనిపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత 1986లో సంజీవ్‌కపూర్ ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు.

లలితా పవర్


ఈమె 70 సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగింది. 12యేండ్ల వయసులో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. సుమారు 700 సినిమాల్లో నటించింది.

పైడి జయరాజ్


1929లో ఆయన సినిమా కెరీర్ మొదలైంది. తెలంగాణ నుంచి వెళ్లి బాలీవుడ్లో మంచి నటుడిగా పేరు సంపాదించాడు. ఆయన 70 సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో ఉన్నారు. సుమారు 300సినిమాల్లో నటించారు. సుదీర్ఘ కెరీర్ కలిగిన నటుడుగా ఆయన రికార్డును సొంతం చేసుకున్నాడు.