Indian Navy complaint to Vizag Police Commissioner to take strict legal action against Sai Priya
mictv telugu

సాయి ప్రియకు షాక్.. అట్లుంటది మరి నేవీతోని

July 30, 2022

Indian Navy complaint to Vizag Police Commissioner to take strict legal action against Sai Priya

ప్రియుడి కోసం పెళ్లి రోజు నాడు భర్తను వదిలేసి వెళ్లిన సాయి ప్రియకు గట్టి షాక్ తగిలింది. భర్తతో కలసి విశాఖలోని ఆర్కే బీచ్‌కు వెళ్లిన సాయి ప్రియ.. అకస్మాత్తుగా కనిపించకపోవడంతో తన భార్య అలల్లో కొట్టుకుపోయిందంటూ.. శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు, అధికారులు ఆ మేరకు సెర్చ్ ఆపరేషన్ చేశారు. అప్పటికప్పుడు ఇండియన్ నేవీ అధికారులు.. సాయిప్రియ సముద్రపు అలలకు కొట్టుకుపోయి ఉంటుందని మూడు కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాప్టర్‌ను ఉపయోగించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. అత్యంత ఖర్చు పెట్టి హెలికాప్టర్ ద్వారా సముద్రంపై నుండి గాలించాయి.

ఆ తర్వాత అదంతా డ్రామా అని తెలియడంతో నేవీ మండిపడింది. ఆమె చేసిన పనికి ప్రజాధనం, సమయం వృథా అయ్యాయని తెలిపింది. అందరినీ తప్పు దోవ పట్టించిన సాయి ప్రియపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని.. నగర్ పోలీస్ కమిషనర్‌తో పాటు జీవీఎంసీ కమిషనర్‌కి ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉంటే ప్రియుడిని పెళ్లి చేసుకుని… తాజాగా వైజాగ్‌లోని ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది సాయి ప్రియ. తప్పు చేసినందకు మన్నించమని అధికారులను కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. పోలీసులు సాయిప్రియ, రవి పేరెంట్స్‌తో పాటు భర్త శ్రీనివాస్‌కు సైతం కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే వారు చేసిన పని.. తమను కృంగదీసిందని.. వారిని ఇళ్లకు రానివ్వమని పేరెంట్స్ స్పష్టం చేశారు. పేరెంట్స్‌తో కాకుండా తామిద్దరం కలిసి వేరుగా ఉంటామని సాయిప్రియ, రవి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ వ్యవహారంలో నేవీ అధికారులు 36 గంటలు సెర్చ్ ఆపరేషన్ చేసే బదులు ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించినట్లయితే సాయిప్రియ కనిపించేదని, ఈ వృథా శ్రమ, సమయం, ఖర్చు తగ్గేదని కొందరు నెటిజన్లు అంటున్నారు.