ముంబై తీరంలో కుప్పకూలిన ఇండియన్ నేవీ హెలికాఫ్టర్.. - Telugu News - Mic tv
mictv telugu

ముంబై తీరంలో కుప్పకూలిన ఇండియన్ నేవీ హెలికాఫ్టర్..

March 9, 2023

భారతనౌకాదళానికి చెందిన హెలికాఫ్టర్ ముంబై తీరంలో కుప్పకూలింది. నేవి పెట్రోలింగ్ ద్వారా హెలికాఫ్టర్ లో ఉన్న ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. అరేబియా సముద్రం తీరం మీదుగా ఎగురుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతికలోపం తలెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పైలెట్ అదుపుచేయలేక ఒక్కసారి హెలికాప్టర్ కిందపడిపోయింది. ఈ ప్రమాదం సమయంలో హెలికాప్టర్ తన అత్యవసర ప్లోటేషన్ గేర్ ను మోహరించింది. నౌకాదళ పెట్రోలింగ్ ముగ్గురు సిబ్బందిని రక్షించినట్లు నేవీ అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. హెలికాప్టర్ ఎలా కూలిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. రక్షించిన సిబ్బందిని రెస్క్యూ టీం ఆసుపత్రికి తరలించాలి. నేవి అధికారిక ట్విట్టర్ లో ఇండియన్ నేవీ విమానం ముంబై తీరంలో కూలిందని, వెంటనే సెర్చ్, రెస్య్కూ ఫలితంగా అందర్నీ సురక్షితంగ రక్షించాం అంటూ ట్వీట్ చేశారు.