బంగాళాఖాతంలో క్షిపణి ప్రయోగం సక్సెస్ - MicTv.in - Telugu News
mictv telugu

బంగాళాఖాతంలో క్షిపణి ప్రయోగం సక్సెస్

October 31, 2020

 

Bay of Bengal

చైనాతో ఎప్పటికైనా ప్రమాదం పొంచివుందని భావించిన భారత ప్రభుత్వం క్రమంగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. గత కొన్ని రోజులుగా క్షిపణులను పరీక్షిస్తోంది. ఇటీవల అరేబియా సముద్రంలో ఐఎన్‌ఎస్‌ ప్రబల్‌ యుద్ధనౌక నుంచి ప్రయోగించిన యాంటీ షిప్‌ మిస్సైల్‌ ప్రయోగం విజయవంతమైంది. తాజాగా భారత నౌక దళం శుక్రవారం చేసిన మరో క్షిపణి ప్రయోగం సక్సెస్ అయింది. 

తూర్పు నౌకాదళ పరిధిలో బంగాళాఖాతంలో క్షిపణి సామర్ధ్య యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోరా నుంచి ప్రయోగించిన నౌకా విధ్వంసక క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ప్రయోగం గురించి భారత నౌకాదళం ట్వీట్‌ చేస్తూ…’ఇది గరిష్ట దూరంలోని తన లక్ష్యాన్ని సమర్ధవంతంగా ఛేదించింది. క్షిపణి ఢీకొట్టడంతో నౌక ధ్వంసమైంది. క్షిపణి ప్రయోగం సక్సెస్ అయింది.’ అని తెలిపింది. ఈ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోని నేవీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేవి సాధించిన ఈ విజయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నేవి అధికారులను అభినందిస్తున్నారు.