Indian Nurse Wanted For Murder, Australia Offers $1 Million For Info
mictv telugu

ఆ భారతీయుడిని పట్టిస్తే రూ.5.21కోట్లు

November 3, 2022

భారతీయులకు ఆస్ట్రేలియన్ పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆస్ట్రేలియా యువతి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని అప్పగిస్తే భారీ నజరానా ఇస్తామన్నారు. అతను ఆస్ట్రేలియ విడిచి భారత్ కు వచ్చేసాడని అతని ఆచూకీ తెలిపితే ఏకంగా రూ.5.21కోట్ల రివార్డు ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఆస్ట్రేలియాలో తోయా కార్డింగ్లీ అనే యువతి 2018 అక్టోబర్‌లో దారుణంగా హత్యకు గురైంది. కైర్న్స్ నగరానికి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న వాంగెట్టి బీచ్‌లో తన కుక్కతో కలిసి వాకింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఆమెను హత్య చేశారు. భారత్‌కు చెందిన రాజ్‌విందర్ సింగ్(38)కు తోయా హత్య కేసుతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు.అయితే తోయా హత్య జరిగిన రెండు రోజుల తర్వాత రాజ్‌విందర్ ఆస్ట్రేలియాను వీడినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.

అతడు తన భార్య, ముగ్గురు పిల్లలను ఆస్ట్రేలియాలోనే విడిచిపెట్టి దేశాన్ని వీడినట్టు పేర్కొంటున్నారు. రాజ్‌విందర్ భారత్‌కు వచ్చినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే అతడి ఆచూకి చెప్పిన ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అతడి ఆచూకీ తెలిసిన వాళ్లు police.qld.gov.au/reporting లేదా 1800 333 000 ద్వారా తమకు సమాచారం అందించాలని కోరారు. జాడ చెప్పిన వాళ్లకు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను రివార్డుగా ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.