Indian oil companies earning 10 rupees per liter of petrol
mictv telugu

లీటర్ పెట్రోల్ పై కంపెనీలకు రూ. 10 లాభం.. డీజిల్ పై ఎంతంటే

January 6, 2023

చమురు విక్రయించే కంపెనీలు లీటర్ పెట్రోల్ పై రూ. 10 లాభం పొందుతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించలేదని అభిప్రాయపడింది. గతంలో ధరలు పెరిగినప్పుడు నష్టపోయిన మొత్తాన్ని ఈ లాభంతో భర్తీ చేసుకుంటున్నాయని తెలిపింది. అయితే డీజిల్ పై మాత్రం నష్టం వస్తోందిన వివరించింది. లీటర్ డీజిల్ పై రూ. 6.50 నష్టాన్ని కంపెనీలు భరిస్తున్నట్టు పేర్కొంది. అలాగే గత 15 నెలలుగా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను కంపెనీలు సవరించడం లేదని గుర్తు చేసింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా పలుమార్లు ధరలు బాగా తగ్గిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. గతేడాది జూన్ 24తో ముగిసిన వారంలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియంలు లీటర్ పెట్రోల్ పై రూ. 17.40, డీజిల్ పై రూ. 27.70 నష్టాన్ని భరించినట్టు నివేదికలో వెల్లడించింది.