ప్రపంచ కప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచ కప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్

June 11, 2019

క్రికెట్ ప్రపంచ కప్‌‌లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడ్డాడు. దీంతో మూడు వారాలపాటు ఆయన జట్టుకి దూరమయ్యాడు. ధావన్ బొటన వేలుకు గాయం కావడంతో ఆయన మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Indian opener Shikhar Dhawan Ruled Out Of World Cup For 3 Weeks With Thumb Injury

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ధావన్ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే.. పూర్తిగా వరల్డ్ కప్‌కి దూరం కావాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ గాయపడ్డాడు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఓవల్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ధావన్ 117 పరుగులతో చెలరేగాడు. మ్యాచ్ మధ్యలో కౌల్టర్ నైల్ వేసిన బంతి ధావన్ ఎడమ చేతి బొటనవేలిని బలంగా తాకింది. దీంతో వేలికి తీవ్రగాయమైంది. అయినా బ్యాండ్ ఎయిడ్ వేసుకుని ధావన్ తన ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు వేలు సహకరించకపోవడంతో రవీంద్ర జడేజా గ్రౌండ్‌లోకి వచ్చాడు.