విదేశాల్లో ఎన్నో రంగాల్లో భారతీయులు తమ సత్తా చాటుతూనే ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీల కీలక బాధ్యతలు వారే చూస్తున్నారు. అంతే కాదు రాజకీయాల్లోనూ కీలక శాఖల్లో రాణిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ అరుదైన అవకాశం భారత సంతతికి చెందిన వ్యక్తికి దక్కింది. ఏకంగా దేశ అధ్యక్ష బాధ్యతలను అక్కడి ప్రజలు కట్టబెట్టారు. సీషెల్స్ దేశంలో ఇది జరిగింది.
బిహార్‌కు చెందిన క్రైస్తవు పురోహితుడు వేవెల్ రామ్కలవన్ సీషెల్స్ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు డానీ ఫౌర్ను ఓడించి త్వరలోనే ఈ బాధ్యతలు తీసుకోబోతున్నారు. 55 శాతం ప్రజా ఆమోదంతో ఆయనకు ఈ అవకాశం దక్కింది. దీంతో భారత సంతతికి చెందిన వ్యక్తి ఓ దేశాధ్యక్షుడు కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్కలవన్ లిన్యోన్ డెమోక్రాటిక్ సెసెల్వా(ఎల్డీఎస్) పార్టీ తరుపున తొలిసారి అధికారాన్ని అందుకున్నారు.
2015లో జరిగిన ఎన్నికల్లో రామ్కలవన్ కేవలం 193 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన తాజాగా విజయాన్ని అందుకున్నారు. దీంతో దాదాపు 30 ఏళ్లుకు పైగా ఎదురులేకుండా ఉన్న అక్కడి అధికార ఎల్డీఎస్ పార్టీకి ఈ రూపంలో ఊహించని షాక్ తగిలింది. కాగా, ఈ ఎన్నికల్లో రామ్కలవన్కు 54.9 శాతం ఓట్లు వస్తే… డానీ ఫౌర్కు 43.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.