అమెరికా ఉపాధ్యక్ష బరిలో భారత సంతతి మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా ఉపాధ్యక్ష బరిలో భారత సంతతి మహిళ

August 12, 2020

Indian Origin Women in US Vice President Race

అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళకు అరుదైన అవకాశం లభించింది. ఈ ఏడాది అక్కడ జరగబోయే ఉపాధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పేరు తెరపైకి తెచ్చారు. డెమోక్రటిక్ పార్టీ తరుపున ఆమెను పోటీలో నిలుపుతున్నట్టు అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ ప్రతిపాధించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇది తన విజయానికి మరింత ఊతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. యూఎస్ ఉపాధ్యక్ష బరిలో భారత సంతతి మహిళ ఉండటంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కమలా హరిస్ కూడా బిడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. బిడెన్ అధ్యక్షుడు అయితే మన జీవితాలు మరింత మెరుగుపడతాయని ఆమె కూడా ట్వీట్ చేశారు. 

కమలా హారిస్ తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్న ఆమె కాలిఫోర్నియాలో సెనెటర్‌గా ఉన్నారు. అక్కడి ప్రజా సేవకుల్లో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఆమెను అంతా ఫియర్ లెస్ లేడీగా సంబోధిస్తారు. ప్రతి విషయాన్ని ఎంతో ధైర్యంగా ఎదుర్కోవడంతో ఆమెకు ఈ బిరుదు లభించింది. ఇంతే కాకుండా కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. యూఎస్ సెనేట్ కు ఎన్నికైన తొలి సౌత్ ఆసియా దేశాల సంతతికి చెందిన మహిళ కూడా ఆమే కావడం విశేషం. ఇప్పుడు ఏకంగా ఆమె ఉపాధ్యక్ష బరిలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచారు. కాగా ఈ ఎన్నికల తర్వాత మరోసారి జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున కమలా హారిస్ అధ్యక్ష పదవికి పోటీ పడటం కూడా ఖాయమని విశ్లేషకులు ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారు.