భారతీయుడి పంట పండింది.. ఏకంగా 24 కోట్ల లాటరీ - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయుడి పంట పండింది.. ఏకంగా 24 కోట్ల లాటరీ

August 4, 2020

Indian own 24 crore lottery.

కరోనా వైరస్ విపత్కర సమయంలో దుబాయిలో ఉండే ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. ఏకంగా రూ. 24కోట్ల లాటరీ గెలుపొందాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపాంకర్ డే దుబాయ్ లో పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం భార్య స్వాతి, కూతురు తనిస్తాలతో కలిసి దీపాంకర్ స్వరాష్ట్రంలోనే ఉంటున్నాడు. 

ఈ క్రమంలో జూలై 14న ఆన్‌లైన్‌లో మరి కొంతమంది స్నేహితులతో కలిసి అబుధాబికి చెందిన బిగ్‌టికెట్ రాఫెల్‌ లో నెం. 041486 గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా సోమవారం తీసిన డ్రాలో దీపాంకర్ గెలుపొందాడు. దీంతో అతడి అనడానికి అవధుల్లేవ్. తాను లాటరీ గెలిచినట్టు ఫోన్ వచ్చిన సమయంలో వంటగదిలో బిజీగా ఉన్నానని దీపాంకర్‌ తెలిపాడు. 2018 నుంచి బిగ్‌టికెట్ రాఫెల్‌లో 11 మంది స్నేహితులం కలిసి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నామని, ఎప్పుడో ఒకసారి తాము లాటరీ గెలిచి తీరుతామని నమ్మేవాళ్లమని అన్నాడు. ప్రస్తుతం గెలిచిన ఈ డబ్బుని సమానంగా పంచుకుంటామన్నాడు.