Home > Featured > రైలు ప్రయాణికులకు గమనిక.. వాటిని వాడితే ఊరుకోం!

రైలు ప్రయాణికులకు గమనిక.. వాటిని వాడితే ఊరుకోం!

ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లు, రైళ్లకు సంబంధించిన ఇతర పరిసరాల్లో హానికారక ప్లాస్టిక్ ను నిషేధించింది. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.

50 మైక్రాన్‌ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల వాడకాన్ని రైల్వే శాఖ నిషేధించింది. దానితోపాటు పలు నియంత్రణ చర్యలు కూడా చేపట్టనుంది. ప్లాస్టిక్ బాటిళ్లను నిర్మూలించే క్రషింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. దీని కోసం కొన్ని ప్రోత్సహకాలను కూడా ప్రకటించనుంది. ఒకసారి మాత్రమే వాడేసే ప్లాస్టిక్ సామగ్రిపై నిషేధాన్ని తొలి దశ కింద 360 ప్రధాన స్టేషన్లలో అమలు చేస్తామని, దీని కోసం 1,853 ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ క్రషింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. దీని ద్వారా వాడిన బాటిల్స్‌ను బయట పడేయకుండా చూడొచ్చని, ఫలితంగా పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టొచ్చని అన్నారు. భారీ నెట్ వర్క్ వున్న రైల్వలో రోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతుంటాయి.

Updated : 21 Aug 2019 9:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top