Indian Railways announce a news For Booking Online Tickets Via UTS App
mictv telugu

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

January 4, 2023

రైలు ప్రయాణం చేసేవారంతా ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలనే రూల్ ఏం లేదు. తక్కువ దూరం ప్రయాణం చేసేవారైనా, రోజువారీ పనుల కారణంతో మరో చోటుకి వెళ్లేవారు కూడా సాధారణంగా జనరల్ బోగీల్లోనే ప్రయాణిస్తారు. వీరంతా సంబంధిత రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలోనే టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి క్యూలో నిలబడి టిక్కెట్ తీసుకునేలోపు రైలు కూడా వెళ్లిపోతుంది. ఇలాంటి ఇబ్బందులేం లేకుండా ప్రయాణికులకు ఇండియన్ రైల్వే ఓ శుభవార్తను అందించింది. ఇకపై టికెట్ కోసం క్యూ లైన్లో నిల్చుకోకుండా నేరుగా యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.

మీ మొబైల్ ఫోన్‌తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటుని కల్పించింది. రోజూ ప్రయాణించే ప్యాసింజర్లలకు లేదా ఆకస్మిక బయట ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా యూటీఎస్ (అన్ రిజ‌ర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్ట‌మ్‌) యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎలా బుక్ చేసుకోవాలంటే..

జనరల్ బోగీ లేదా ఫ్లాట్ ఫాం టికెట్ల కోసం.. ప్లే స్టోర్ నుంచి యూటీఎస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో లాగిన్ అయిన తర్వాత జీపీఎస్ ఆన్ చేసి, కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే జీపీఎస్ ద్వారానే ఇది పని చేస్తుంది. జీపీఎస్ ఆధారంగా 5-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ప్రయాణిస్తున్న రైల్వే స్టేషన్‌, దాని కోడ్‌, మీరు చేసుకోవాల్సిన రైల్వే స్టేషన్‌ లేదా కోడ్‌, ప్రయాణికుల సంఖ్య, అందులో ప్యాసింజర్‌, లేదా ఎక్స్‌ప్రెస్‌ రైలు వంటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి . ప్లాట్‌ఫామ్ టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే రైల్వే స్టేషన్‌కు రెండు కిలోమీటర్లు లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే ఇతర నిబంధనలకు అనుగుణంగానే ఈ యాప్ ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. 17 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి ఈ యాప్ అందుబాటులోకి లేదు.