Indian Railways announced Sabarimala special trains for Ayyappa devotees
mictv telugu

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. 26 స్పెషల్ ట్రైన్స్

November 11, 2022

శబరిమల అయప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సికింద్రాబాద్‌ నుంచి కేరళకు వెళ్లి వచ్చే శబరిమల భక్తుల కోసం రానుపోను కలిపి మొత్తం 26 ప్రత్యేక రైలు సర్వీసులు నడవనున్నాయి.  సికింద్రాబాద్‌ నుంచి కొల్లం, కొట్టాయంకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.  సికింద్రాబాద్ – కొల్లం స్టేషన్ల మధ్యలో ఈ నెల 20 నుంచి ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగుతాయి. వచ్చే ఏడాది జనవరి 17 వరకు శబరిమలకు ఈ సర్వీసులుంటాయి.  మొత్తంగా ఎనిమిది సర్వీసులుగా సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

వాటిలో.. రైలు నెంబర్ 07117.. సికింద్రాబాద్ నుంచి కొట్టాయంకు నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీలతో పాటు 2023 జనవరి 1, 8, 15 తేదీల్లో అందుబాటులో ఉంది. ఈ రైలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 9 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. రైలు నెంబర్ 07118 కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు 2023 జనవరి 3, 10, 17 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు మంగళవారం రాత్రి 11.20 గంటలకు కొట్టాయంలో బయల్దేరి బుధవారం అర్ధరాత్రి 1 గంటకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.