ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఖాతాదారులకు ఇండియన్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి పరిమితిని పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఆధార్ లింక్ చేసుకోని ఒక్కో యూజర్ ప్రస్తుతం తమ ఐడీపై నెలకు గరిష్టంగా 12 టిక్కెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు.
అంతకుముందు ఈ పరిమితి కేవలం 6 టిక్కెట్లగానే ఉండేది. అలాగే ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌తో ఆధార్ అనుసంధానం చేసుకున్న యూజర్లయితే తమ యూజర్ ఐడీపై నెలకు ఇక 24 టిక్కెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. దీంతో ఇకపై ఫ్యామిలీ మొత్తం ఎక్కడైనా రైల్లో ప్రయాణం చేయడానికి టికెట్ల బుకింగ్ కోసం రెండు లేదా మూడు యూజర్ ఐడీలు ఉపయోగించాల్సిన అవసరం లేదు.