రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లను నడుపుతామని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. జూన్ 1 నుంచి సమయానుకూలంగా 200 ప్రత్యేక నాన్ ఏసీ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే వీటికి సంబంధించిన సమయ పట్టికను విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలనుకునే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కారణంగా రిజర్వేషన్ కౌంటర్ వద్ద టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వారికే ప్రయాణ అవకాశం కల్పిస్తామని అన్నారు. రిజర్వేషన్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి నాన్ ఏసీ రైళ్లు మాత్రమే నడపనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే వలస కార్మికుల కోసం 200 శ్రామిక్ రైళ్లను నడిపిస్తున్నారు. వీటికి తోడు మరో 200 రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసిన తర్వాతనే ప్రయాణాలకు అనుమతి ఇవ్వనున్నారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.