హమ్మయ్య.. ‘ఇండియా బిన్ లాడెన్’ దొరికాడు! - MicTv.in - Telugu News
mictv telugu

హమ్మయ్య.. ‘ఇండియా బిన్ లాడెన్’ దొరికాడు!

November 12, 2019

కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టడానికి అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. లాడెన్ మాదిరే మనుషులను ఉత్తిపుణ్యానికి చంపుతూ ‘ఇండియా బిన్ లాడెన్’గా పేరు సంపాదించుకున్న ఏనుగు ఒకటి అస్సాం వాసులను హడలెత్తించింది. దాన్ని పట్టుకోడానికి చాన్నాళ్లుగా సాగుతున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఇండియా మోస్ట్ వాటెండ్ ‘లాడెన్’ దురాగతాలకు తెరపడింది.  

గోల్పారా జిల్లాలో ఈ మదపుటేనుగు ఐదుగురిని చంపేసింది. పంటపొలాలను, ఇళ్లను ధ్వంసం చేస్తూ ధ్వంసం చేస్తోంది. దాని ఆటకట్టించడానికి అటవీ శాఖ అధికారులు, పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. అమెరికా  అయిల్ కాయిదా అధినేత ఆచూకీ కనుక్కోడానికి డ్రోన్లు వాడినట్లు ఈ గజరాజు ఆచూకీ కోసం డ్రోన్లు వాడారు.

tt

పక్కా సమాచారం తెలుసుకుని బాణాల ద్వారా మత్తు మంది ప్రయోగించి పట్టుకున్నారు. దీన్ని జనావాసాలకు దూరంగా తరలిస్తామని చెప్పారు. మనదేశంలో ఏనుగులు వల్ల ప్రాణఆస్తినష్టాలు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గజరాజుల దాడిలో గత ఐదేళ్లలో 2,300 మంది చనిపోగారు. వేటగాళ్ల చేతుల్లో, ప్రకృతి విపత్తుల్లో 700 ఏనుగులు చనిపోయాయి. 

er